వేదముల ద్వారా ప్రతిపాదింపబడిన అద్వైత సిద్దాంతమును అవైదిక సిద్దాంతములతో జ్ఞానమునకు దూరంగా పోతున్న వారిని తరింప చేయడానికి అవతరించిన అపర శంకరుడే భగవత్పాద శంకరులు.శ్రీశంకరులు చెప్పిన అద్వైత సిద్దాంతము నందు ప్రధానంగా పరమార్ధ వస్తువు ఒకే ఒకటి అన్నారు. దానిని పరంబ్రహ్మ అని పిలుస్తున్నాము. అద్వైత సిద్దాంతములపై వచ్చిన అపవాదములను వారు సున్నితంగా పరామర్శించారు అనేక పర్యాయములు. అలాగే నిర్గుణ బ్రహ్మమును నేను అని భావించవచ్చు గాని మనము నిత్యము పూజించే భగవంతుడిని నేను అని భావింపమని ఎక్కడా తెలుపలేదు.
షట్పదీ స్తోత్రము లో
సత్యపి భేదాపగమే నాధ తవాహం న మామకీనస్త్వం
సాముద్రో హి తరంగ: క్వచన సముద్రో న తారంగ:
విష్ణో ! శుధ్ధ చైతన్యరూపంలో మన మద్య బేధము లేకపోయినా, ఈశ్వరునికి భక్తునికి మద్యగల తేడా గమనిస్తే స్వామీ నేను నీ వాడను కానీ నీవు నావాడవు అని అనకూడదు. సముద్రము తరంగమునకు వస్తుతః భేదము లేకపోయినా సముద్రము యొక్క తరంగము అని అంటాముగానీ తరంగము యొక్క సముద్రము అని అనము గదా.

No comments:
Post a Comment